*అవినీతి, అక్రమాలపై పోరాడే పార్టీ బీజేపీ.
*బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే
*ముస్తాబాద్ లో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర.
బలగం టివి ,ముస్తాబాద్.
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర చిప్పలపల్లి నామాపూర్ గ్రామాల నుండి ముస్తాబాద్ మండల కేంద్రానికి బుధవారం సాయంత్రం చేరుకుంది.మహిళలు బోనాలతో మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి కూడలిలో నిర్వహించిన రోడ్ షోలో బండి సంజయ్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలపై పోరాడి కేసులకు భయపడకుండా ప్రజల తరఫున నిస్వార్ధంగా పోరాటం చేసింది బిజెపి కార్యకర్తలని అభినందించారు.దేశానికి మోడీ ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ రెండు నెలలైనా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు.ప్రజలకు అండగా నిలిచేది ప్రజల తరఫున కొట్లాడేది ఎప్పటికైనా బిజెపి పార్టీ మాత్రమేనని మోడీ నాయకత్వాన్ని బలపరిచి ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.పోతుగల్ గ్రామంలో పర్యటించి గ్రామస్తులకు కేంద్రం అందిస్తున్న పథకాలు అభివృద్ధిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి రాణి రుద్రమదేవి, జిల్లా అధికార ప్రతినిధి గోపి మండల,పట్టణ అధ్యక్షులు అంజాగౌడ్, మహేందర్,సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర రెడ్డి, బాద నరేష్,కళ్యాణ్,బుర్ర శ్రీనివాస్ గౌడ్,సంజీవ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు జనార్ధన్ మండల బిజెపి నాయకులు వరి వెంకటేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.