గులాబీ జెండా అందరికీ అండ
ప్రతిపక్షాలకు డిపాజిట్ గల్లంతు
బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి
సిరిసిల్ల న్యూస్:
గులాబీ జెండా ప్రజల అండ అభివృద్ధి ప్రదాత కేటీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకం కింద దశలవారీగా ఐదేళ్లలో 16వేలు దివ్యాంగులకు 6వేలు ఆసరా పెన్షన్ దశలవారీగా 5016 తెల్ల రేషన్ కార్డు ఉన్న 93 లక్షల కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యం కేసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అన్నారు. అన్నపూర్ణ పథకం కింద రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు పై సన్న బియ్యం సరఫర,అర్హులైన పేద కుటుంబాల మహిళలకు జీవనాభృతి, సౌభాగ్య లక్ష్మీకింద 3వేల ధరల పెరుగుదల నేపథ్యంలో పేద కుటుంబాలకు 400 కే వంటగ్యాస్ సిలిండర్ దశలవారిగా రాష్ట్రంలోని మహిళా సమైక్యలకు సొంత భవనాల నిర్మాణం, ఆగ్రవర్ణ పేదలకు గురుకులాలు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మాణం , కేసీఆర్ ఆరోగ్య రక్ష అర్హులైన పౌరులందరికీ ప్రస్తుతం అందిస్తున్న ఆరోగ్య భీమా పరిమితిని 15 లక్షలకు పెంపు, ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇటీవల ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పట్ల సబ్బండ వర్గాల ప్రజలు విశ్వాసం కలిగి ఉన్నారని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ నేతృత్వంలో సిరిసిల్ల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. ఈ ఎన్నికలలో అన్ని వర్గాల ప్రజలు కారు గుర్తు పై మీ అమూల్యమైన ఓట్లు వేసి కేటిఆర్ కు లక్ష కు పైగా మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల విశేష స్పందన చూస్తే కాంగ్రెస్ , బిజెపి , బిఎస్పీ పార్టీ ల అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు అయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసిఆర్ ను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.