బలగం టీవి….
భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ప్రభుత్వ విప్,వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.. మంగళవారం మామిడిపల్లి గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి దేవస్థానం ఆవరణలో శ్రీ సీతారామ స్వామి దేవస్థానం(శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ వారి దత్తత దేవాలయం) మాఘ అమావాస్య జాతర సందర్భంగా వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.. ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి స్వామివారి సన్నిధికి వచ్చిన సందర్భంగా ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు..ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అన్నారు.. తన చిన్నతనం నుండి స్వామి వారి జాతరలో పాల్గొంటున్నాని,గతంలో ఎడ్ల బండి పై వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకునేవారు అని ఆనాటి రోజులను గుర్తు చేశారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలో భక్తులు పెద్ద ఎత్తున జాతర మహోత్సవానికి వస్తుంటారని భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ముందుగా ఆలయానికి చేరుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ఈవో కృష్ణ ప్రసాద్,ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్,ఆలయ ఈఈ రాజేష్, డిఈ రామేశ్వరరావు,ఏఈ రామకృష్ణారావు,శేఖర్,ఆలయ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు,సీసీ ఎడ్ల శివ ఉన్నారు
