ధరణి దొరల చట్టం.. భూ భారతి పేదల చట్టం..

0
49


బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

  • దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం.
  • భూ భారతి విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేదే లేదు..
  • అసైన్డ్ భూములకు కూడా హక్కులు కల్పిస్తాం..
  • రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ధరణి దొరల చట్టం.. భూ భారతి పేదల చట్టం అని, గత ప్రభుత్వంలో తాళిని తాకట్టుపెట్టి భూ సమస్యల పరిష్కారం కోసం తిరిగారని అయినా పరిష్కారం కాలేదని,పేదల కలల ను నెరవేర్చడం కోసం కొన్ని వేల మంది మేధావులతో ఏర్పాటు చేసుకున్న చట్టం భూ భారతి చట్టమని, భూ సమస్యలన్నీ భూ భారతి లో పరిష్కారం అవుతాయని, అంబేద్కర్ జన్మదినం పురస్కరించుకొని ఈ భూ భారతి చట్టం తెచ్చామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో భూ భారతి చట్టం – 2025 పై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూగత ప్రభుత్వ పెద్దలు స్వార్థ పూరితంగా నాలుగు గోడల మధ్య ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా ధరణి చట్టం తయారు చేసిందని అన్నారు. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో రెవెన్యూ చట్టం తయారు చేయాలన్న ఆదర్శంగా ఉండే విధంగా భూ భారతి చట్టం ప్రజా ప్రభుత్వం తయారు చేసిందని, దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం నిలుస్తుందని అన్నారు.
పెండింగ్ ఉన్న సాధా బైనామా చట్టం సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం సాదా బైనమా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ధరణి చట్టంలో సాదా బైనమా గురించి అసలు పెట్టలేదని అన్నారు. రిజిస్ట్రేషన్ లో సరిహద్దులలో పాటు సర్వెయర్ కొలతలతో ప్లాన్ జాతచేయడం జరుగుతుందని,కొలతలను మీ పాసు బుకులో ప్రింట్ చేస్తాము అని, జూన్ 2 వరకు లైసెన్స్ సర్వేర్లను ఎంపిక చేస్తున్నామని అన్నారు.
ప్రతి గ్రామానికి విఆర్ఎ, విఆర్ఓ లు ఉండేవారు, ఆనాటి దొర వారి రాత్రి నిర్ణయాలకు గ్రామాలకు అధికారి లేకుండా పోయారని అన్నారు. జూన్ 2నాడు ముఖ్యమంత్రి చేతుల మీద భూ సమస్యలు పరిష్కారం జరిగే వాటిలో రుద్రంగి గ్రామం ఉంటుందని,ఆగస్టు 15 నాటికి భూమి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని అన్నారు.
మీ నియోజకవర్గం అభివృద్ధి కోసం మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తహతహలాడుతుండు అని అన్నారు.
ఏ అధికారి కూడా ఈ భూ భారతి విషయంలో రైతులను ఇబ్బంది పెడితే ఊరుకుండే లేదని హెచ్చరించారు.
అసైన్డ్ భూములకు కూడా హక్కులు కల్పిస్తామని, పేదలకు భూములు పంచాలని ఆలోచన తమ ప్రజా ప్రభుత్వానిది అన్నారు.

ఇందిరమ్మ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టాన్ని రాజకీయాల కతీతంగా అందరూ వినియోగించుకోవాలని అన్నారు. భూ హక్కుల ఉన్న రైతులకు న్యాయం జరిగేలా తహసిల్దార్ నుంచి సిసిఎల్ఏ వరకు 5 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు.
అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని అన్నారు.

రవాణా శాఖ మంత్రి వర్యులు పోన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భూ సమస్యల రైతులు తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు పడ్డారని, వాటి పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రవేశపెట్టిందని అన్నారు. మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు, భూమి భూ దార్ కార్డు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలకు భూ హక్కుల పై భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములపై ఎటువంటి సమాచారం ఉన్న అధికారులకు తెలియజేయాలని, అక్రమార్కుల నుంచి వాటిని స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాల కోసం వినియోగిస్తామని మంత్రి తెలిపారు. రాబోయే 2,3 రోజులలో వేములవాడ నుంచి ముంబై ప్రత్యేక ఏసీ బస్సు వేస్తామని మంత్రి తెలిపారు. రుద్రంగి బస్ స్టాండ్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.

గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కమాట్లాడుతూ భూ పోరాటాల చరిత్ర కలిగిన రుద్రంగి మండల కేంద్రంలో జరుగుతున్న భూ భారతి అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సాగు చేసుకునే భూములకు పట్టాలు లేని కారణంగా గత ప్రభుత్వం తీసుకొని వచ్చిన ధరణి చట్టం వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయని అన్నారు. గతంలో ఎటువంటి సమస్యలు ఉన్న కోర్టు వెళ్లాల్సిన ఉండేదని, నేడు భూ సమస్యల పరిష్కారానికి తహసిల్దార్ నుంచి సిసిఎల్ఏ వరకు అంచెలంచెలుగా వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. మహిళా సంఘాలను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, స్కూల్ యూనిఫాం దగ్గర నుంచి ఆర్టీసీ అద్దె బస్సుల వరకు, రైస్ మిల్లుల ఏర్పాటు, ఇందిరా మహిళ క్యాంటీన్, వివిధ రకాల వ్యాపార యూనిట్ల స్థాపనకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని అన్నారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యలపై రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన తమ చేతిలో లేదని ఆనాడు పరిష్కరించ లేకపోయామని, ఏ సమస్య పరిష్కారం ఉన్న కోర్టుకు వెళ్లాలని కాలయాపన చేసేవారని, నేడు తమ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకు భూ భారతి చట్టం ప్రవేశపెట్టి భూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. రుద్రంగి భీమారం మండలాల్లో రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, వేములవాడ నియోజకవర్గంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని నిర్మించాలని మంత్రి దృష్టికి విప్ తీసుకెళ్లారు. వేములవాడ నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇండ్ల ఇవ్వాలని కోరగా అదనంగా 1750 ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మిడ్ మానేరు భూ నిర్వాసితులకు మన హయాంలో 4656 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంటి జాగా లేని పేదలకు కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ వేములవాడ ఎమ్మెల్యే తో తనకు చాలా కాలం నుంచి సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. సీఎం, మంత్రులు తోటే శాసనసభ్యులతో మిత్రుడిగా మెలుగుతూ వేములవాడ అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తున్నారని అన్నారు.

కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ భూ సమస్యలు శాశ్వత పరిష్కారం చేసే దిశగా అంబేద్కర్ జయంతి నాడు ప్రభుత్వం భూ భారతి పోర్టల్ ప్రారంభించిందని, ఈ చట్టంపై సందేహాల నివృత్తి కోసం మండల కేంద్రాలలో అవగాహన సమావేశాలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. మన సిరిసిల్ల జిల్లాలో రుద్రంగి మండలం పైలట్ గా ఎంపిక చేసి రెవెన్యూ సరస్సు నిర్వహిస్తున్నామని, తహసిల్దార్ అధికారి నేతృత్వంలో 3 బృందాలను ఏర్పాటు చేసి గ్రామాలలో ప్రజల దగ్గరి నుంచి భూ సమస్యలపై ఇప్పటి వరకు 1027 దరఖాస్తులు స్వీకరించామని అన్నారు.

అనంతరం రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి హెల్ప్ డెస్క్ ను పరిశీలించి రైతులు నుండి స్వీకరిస్తున్న భూ సమస్యల దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రినీ కోరారు. రుద్రంగి గ్రామంలో మంజూరు చేసిన 243 ఇందిరమ్మ ఇండ్ల కు గాను ఈ రోజు 30 ఇండ్లనిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,మార్కెట్ కమిటీ చైర్మన్లు చెలుకల తిరుపతి, రోండి రాజు, కచ్చకాయల ఎల్లయ్య, పండ్ర నారాయణ, ఎం వినోద్, ఎస్పీ మహేష్ బి గితే, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,వేములవాడ ఇన్చార్జి ఆర్డీవో రాధాబాయి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ వెంకట రమణయ్య, హౌసింగ్ పీడీ శంకర్, డీఆర్డీఓ శేషాద్రి, ఇందిరమ్మ ఇండ్ల మండల ప్రత్యేక అధికారి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, తహసిల్దార్ శ్రీ లత, ఎంపీడీఓ నటరాజ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here