గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి ఆకస్మిక మృతి!
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
గుండె పోటుతో సర్పంచ్ మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా అర్ అండ్ కాలనీ లో చోటు చేసుకున్నది. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చింతల్ ఠాణా అర్ అండ్ కాలనీ ఎస్సి జనరల్ కి రిజర్వ్ అవ్వగా బిఅర్ఎస్ పార్టీ మద్దతుతో చెర్ల మురళి(50) సర్పంచ్ అభ్యర్ధి గా నామినేషన్ దాఖలు చేయగా, ఎన్నికల అధికారులు గుర్తులు గుర్తింపు కేటాయింపులో భాగంగా మురళికి కత్తెర గుర్తు కేటాయించారు. గురువారం రాత్రి వరకు ప్రచారం నిర్వహించిన మురళి అర్థరాత్రి గుండెపోటు కు గురై మృతి చెందారు. గ్రామాభివృద్ధికి మెరుగైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్న మురళి అర్ధాంతరంగా మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి..
