మండల కేంద్రంలో అసంతృప్తి రాజీనామాలు

0
102

బలగం టివి,   బోయినిపల్లి;

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల బీజేపీకి భారీ షాక్ తగిలింది. మండలంలోని మండల అధ్యక్షునికి మరియు నాయకులకు, కార్యకర్తలకు భారీ విభేదాలు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో బిజెపి జిల్లా, రాష్ట్ర నాయకులు తమ మండలాన్ని, (తమను) నాయకులను, కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ పార్టీ పదవులకు బీజేపీ నాయకులు గురువారం రోజున రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృఫ్ణకు పంపినట్లు బీజేపి నాయకులు తెలిపారు.
రాజీనామా చేసిన వారిలో చొప్పదండి నియోజకవర్గ కో-కన్వీనర్ ఉదారి నర్సింహాచారి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెంచు నాగరాజు, బీజేపి మండల ఉపాధ్యక్షులు కోండం శ్రీనివాస్ రెడ్డి,ఇల్లందుల బాలయ్య, అన్నేమల్ల మోహన్ బాబు, ఓబీసీ మండల అధ్యక్షులు సారంపల్లి రాజు, ఉపాధ్యక్షులు మహేందర్,ఎస్సీ మోర్ఛామాజీ అధ్యక్షులు జనగాం లక్ష్మణ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు జువ్వెంతుల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆవుల లక్ష్మణ్,బీజేవైఎం ఉఫాద్యక్షులు మిణుకుల శ్రీనివాస్, రాజులతో పాటు పలువురు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here