బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.
అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా రామ మందిరం నుంచి వచ్చిన కలశం అక్షింతలను శనివారం రోజున శ్రీరాముని అక్షింతలు మహిళలు మంగళ హారతులతో, భజనలు చేస్తూ, అక్షింతలను శిరస్సుపై పెట్టుకొని భక్తి పరవశంతో, పార్టీలకు అతీతంగా వీధి వీధిన శోభాయాత్ర నిర్వహించి, గడపగడపకు తిరిగి, శ్రీరాముని అక్షింతలు వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో మానువాడ గ్రామంలోని అన్ని కుల సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, పిల్లలు, పెద్దలు, మహిళలు, రామ భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు