సిరిసిల్ల న్యూస్:
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు లయన్స్ క్లబ్ వారు ఉచిత బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో జెడ్పిహెచ్ఎస్ గజ సింగవరం పాఠశాలలో 25 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు మెరుగైన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆయన విద్యార్థులతో అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం, లయన్స్ క్లబ్ బాధ్యులు భగవత్ దేవాసి, పెంజర్ల రవి, ప్రధానోపాధ్యాయులు ఎస్. సోమయ్య, మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు సోమయ్య లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం కి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.