ఈనెల 16 మరియు 17వ తేదీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను మల్యాల హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్టు టోర్ణమెంట్ నిర్వాహకులు BRS నాయకులు ఈర్లపల్లి రాజు తెలియజేశారు టోర్నమెంట్ నిర్వహణ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా వాలీబాల్ యూత్ సభ్యులకు క్రీడావస్తువులు మరియు దుస్తుల్ని పంపిణీ చేశారు. ఇట్టి టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రులు కేటీఆర్ గారు కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు మరియు చల్మెడ లక్ష్మీ నరసింహ రావు గారు హాజరవుతున్నారని కావున ఇట్టి కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా స్థాయిలో ఉన్న క్రీడాకారులందరూ మరియు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
