బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 9వ వార్డు జెగ్గారావుపల్లె మరియు బాబాజీ కాలనీకి చెందిన చల్ల అనూష్‌కు రూ.32,500/- మరియు మ్యాకల నర్సయ్యకు రూ.17,500/- మొత్తం లబ్ధిదారులకు స్థానిక నాయకులు అందజేశారు. నిరుపేద కుటుంబాల వైద్య అవసరాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కెకె మహేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్‌లకు చల్ల అనూష్ మరియు మ్యాకల నర్సయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాలకీష్టయ్య, యాదయ్య, నర్సయ్య, రాజనర్సు, పర్షయ్య, రాజు, షాదుల్, రాములు, కన్నయ్య, పవన్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
