బలగం టివి, సిరిసిల్ల
అంగన్వాడీలలో స్పాట్ ఫీడింగ్ మరియు హాజరు శాతం మెరుగుపరచడానికి రాగి లడ్డూల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మిరాజం అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణంలో పలు అంగన్వాడీ కేంద్రాలను జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజం సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మిరాజం మాట్లాడుతూ మిషన్ వాత్సల్య నిధులతో అంగన్వాడీలలో ప్రీస్కూల్ పిల్లల హాజరు మెరుగుపడుతున్నదనీ అన్నారు. గర్భవతులు, బాలింతలు స్పాట్ ఫీడింగ్ వచ్చి పోషకాహారం తీసుకొని మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.అంగన్వాడీలో అందుతున్నటువంటి సరుకులను నాణ్యతను పరిశీలించారు..