బలగం టివి, ఇల్లంతకుంట
ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట అంగన్ వాడి కేంద్రంలో శనివారం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు (చిరుధాన్యాలతో) తయారు చేసిన మల్టీ మిల్లెట్ గ్రీన్ లడ్డూలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఐసీడీఎస్ పెద్దలింగాపూర్ సెక్టార్ సూపర్ వైజర్ సూర్యకళ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలలో రక్తహీనత నివారించడంతో పాటు చిన్నారుల్లో పోషకాహార లోపం నుంచి విముక్తులని చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ దర్శనాల స్వప్న, తదితరులు పాల్గొన్నారు.