- శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జన సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ నుండి జన్మదినం వరకు జరగబోయే కార్యక్రమాలలో భాగంగా, రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత విగ్రహం వద్ద “అమ్మ పేరుతో” మొక్కల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ ఆడెపు రవీందర్, మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నే హరీష, జిల్లా ఉపాధ్యక్షురాళ్ళు ఆసాని లావణ్య, పండుగ మాధవి, సిరిసిల్ల పట్టణ మహిళా అధ్యక్షురాలు వైశాలి, కొనరావుపేట్ మండల మహిళా అధ్యక్షురాలు తీగల జయశ్రీ, బిజెపి సీనియర్ నాయకులు వంతడుపుల సుధాకర్, కొంపల్లి రాజేందర్, సిరిసిల్ల వంశీ, అభి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.

