బలగం టీవి, బోయినిపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రానికి చెందిన 09-01-2024 రోజున సిరిపురం అనసూయ (78) అనారోగ్యం వలన స్వర్గస్తులైనారు. 16-01-2024 మంగళవారం రోజున వారి కుటుంబ సభ్యులను బోయినిపల్లి మండల పవర్ లూమ్స్ కార్మిక సంక్షేమ సంఘం తరపున వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం పంపిణీ చేసినారు.
అలాగే తేదీ 11-01-2024 రోజున పుల్లరి అంజనేయులు (47) అదుపుతప్పి బావిలో పడి మృతి చెందినాడు. మంగవారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బోయినిపల్లి మండల పవర్ లూమ్స్ కార్మిక సంక్షేమ సంఘం తరఫున వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం పంపిణీ చేసినారు.
ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దూస జనార్ధన్, ఉపాధ్యక్షులు శ్రీపతి దేవయ్య, కోశాధికారి శ్రీపతి రవీందర్, కార్యదర్శులు దేవసాని శ్రీనివాస్, శ్రీపతి జనార్ధన్, కార్యవర్గ సభ్యులు మ్యాన రమేష్, బిళ్ళ వెంకటస్వామి, భీమనాథుని శ్రీనివాస్, వాసాల శ్రీనివాస్ లు తదితరులు పాల్గొన్నారు.
