సిరిసిల్ల న్యూస్:
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెకండ్ పేస్ పాఠ్యపుస్తకాలను ఉపాధ్యాయులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి ఆరాధన మాట్లాడుతూ సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్ మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇటువంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చదువుల్లో రాణించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ షేక్ బాబు,ఉపాధ్యాయులు ఎం శ్రీకాంత్, ఎస్ శ్రీనివాస్,టీ మల్లికార్జున్,పి వాసుదేవరావు,పి రజిని,ఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.