బలగం టివీ:
- ప్రతి ఇంటికి ఓటరు స్లిప్‌లు
- ఓటరు స్లిప్ లతో పాటు ఓటరు గైడ్, సి-విజిల్ పాంప్లెట్ ను ఓటర్ల కు అందజేత
- బీఎల్‌వోల ద్వారా పంపిణీ
– పర్యవేక్షణ చేస్తున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
సిరిసిల్ల 14, నవంబర్ 2023
నవంబర్ 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో
నవంబర్ 13వ తేదీ నుంచి ఓటరు సమాచార స్లిప్పులను బూత్ లెవెల్ అధికారుల ద్వారా పంపిణీ చేస్తున్నారు.
ఓటరు సమాచార స్లిప్పులను కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యవేక్షణ చేస్తున్నారు.
తమ బూత్ పరిధిలో
BLO ఓటర్ స్లిప్‌ను నమోదిత ఓటరుకు లేదా ఓటరు కుటుంబంలోని వయోజన సభ్యునికి అందజేస్తున్నారు. BLO ఓటర్ స్లిప్‌ను స్వీకరించినందుకు రసీదుగా, రిజిస్టర్‌లో ఓటర్ స్లిప్ పంపిణీ చేయబడిన వ్యక్తి యొక్క సంతకం లేదా బొటనవేలు ముద్రను తీసుకుంటున్నారు.
ఓటరు స్లీప్ తో పాటు సి-విజిల్ పాంప్లెట్ ను ఓటరు కు అందజేస్తున్నారు. అలాగే ప్రతి కుటుంబానికి ఓటరు గైడ్ ను కూడా అందజేస్తున్నారు.
సెక్టార్ పరిధిలో ఓటరు స్లిప్ లు ప్రతి ఓటరుకు అందేలా సెక్టార్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.