బలగం టీవి, , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామములో స్వయంబుగా వెలసిన దత్తాత్రేయ స్వామి దేవాలయ అభివృద్ధి పనులు,రవాణా సౌకర్యము బ్రిడ్జి నిర్మాణం కొరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్ గురువారం రోజున వినతి పత్రం అందజేశారు భారతదేశంలోని రాహుశయన దత్తాత్రేయ స్వామి 500 సరాల క్రితం శ్రీ వెంకట అవదూత ఘోర తపస్సు చేయగా స్వయంబు దత్తాత్రేయ స్వామిగా గ్రామములోని గుట్టపైన స్వయంబుగా వెలసినారు.ఎన్నో సంవత్సరాల నుండి పూజలు నిర్వహిస్తున్నారు.ప్రక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, కర్ణాటక నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారు.దత్తాత్రేయ స్వామి దేవాలయము శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మధ్య మానేరు)లో మునిగిపోయినప్పటి నుండి పూజ కార్యక్రమములు రోజు నిర్వహించడం లేదు. కేవలం దత్తాత్రేయ జయంతి రోజున మాత్రమే పడవలలో వెల్లి పూజలు చేస్తున్నారు.
దత్తాత్రేయ స్వామి దేవాలయము చుట్టూ నీరు ఉండి,ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అనుకూలంగా స్పందించారని కూస రవీందర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కొండం సతీష్ రెడ్డి, కొనుకటి సూర్యకాంత్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.