జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లను కలిసిన డోర్స్ నూతన కార్యవర్గం -అభినందనలు తెలిపిన కలెక్టర్

0
187

బలగం టీవి, రాజన్న సిరిసిల్ల :

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ లకు డోర్స్ నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో మర్యాదపూర్వకంగా కలిశారు.
తమ ఎంపికను జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారుల అసోసియేషన్ ( DOARS – డోర్స్) నూతన కార్యవర్గ సభ్యుల ఎంపిక ఇటీవలే జరిగింది.

డోర్స్ ఫౌండర్ చైర్మన్ గా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ ఉండగా, డోర్స్ అధ్యక్షుడు గా జిల్లా రవాణా అధికారి వై కొండల్ రావు, జనరల్ సెక్రటరీ గా ఎ వినోద్ కుమార్, కోశాధికారిగా పిబి శ్రీనివాస చారి , ప్రచార కార్యదర్శిగా మామిండ్ల దశరథం ఎంపికయ్యారు. ( పూర్తి సభ్యుల వివరాలు జత చేస్తున్నాం).

నూతన నియామకం అయిన డోర్స్ అధ్యక్షులు జిల్లా రవాణా అధికారి వై కొండల్ రావు, కోశాధికారిగా పిబి శ్రీనివాస చారి , జాయింట్ సెక్రటరీ బి గంగయ్య ,
ప్రచార కార్యదర్శులు మామిండ్ల దశరథం, భాస్కర్,
కార్యవర్గ సభ్యులు లక్ష్మి రాజం లు drdo నక్క శ్రీనివాస్,అదనపు drdo మదన్ లు కలెక్టర్ ను కలిశారు.

డోర్స్ నూతన కార్యవర్గ సభ్యులను జిల్లా కలెక్టర్ అభినందించారు.
ప్రభుత్వ శాఖల అధికారుల మధ్య సమన్వయం పెంపొందిస్తూ ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here