బలగం టీవీ, తంగళ్ళపల్లి:
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం, ఎస్ఎస్ టీ చెక్ పోస్ట్ ను ఎన్నికల జిల్లా వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. తంగళ్ళపల్లి ఎంపీడీఓ కార్యాలయం, అలాగే జిల్లెల వద్ద ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ ను పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి నవీన్, భారతి, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
