బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యాలయాలను జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఎల్లారెడ్డిపేట ఎంపీడీఓ, వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాలను పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి నవీన్, భారతి, ఎంపీడీఓ సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

