బలగం టీవి :రాజన్న సిరిసిల్ల
మాధకద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం ద్వారా కలిగే అనర్థాల పట్ల యువతలో అవగాహన పెంపొందించడం కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన “యాంటీ డ్రగ్స్ క్లబ్స్” ఆధ్వర్యంలో రేపు శుక్రవారం (19-01-2024) రోజున జిల్లాలోని అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులను 2 to 5th Class , 6th to 10th Class ,Intermediate and Degree 03 కేటగిరీలుగా విభజించి మాధకద్రవ్యాల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలు, అవగాహనపై తమ తమ పాఠశాల్లో, కళాశాలల్లో చిత్రలేఖనం (పెయింటింగ్) పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., పేర్కొన్నారు.ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మండలాల వారీగా ఎంపిక చేసి వారికి జిల్లా స్థాయిలో ప్రశంసాపత్రాలు, బహమతులు ప్రధానం చేయడం జరుగుతుందన్నారు