పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ..

0
78

బోయినిపల్లి మండలంలో పర్యటన..

  • జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే…

బలగం టీవీ, బోయినిపల్లి:

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఉదయం పలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి, పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించి విధులలో ఉన్న సిబ్బందికి భద్రత పరమైన పలు సూచనలు చేశారు.

జిల్లా ఎస్పీ మొదటగా బోయినిపల్లి, ఆ తర్వాత కోదురుపాక, నీలోజపల్లి, మరియు విలసాగర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఆయన పోలింగ్ కేంద్రాల లోపల, బయట జరుగుతున్న ప్రక్రియను పరిశీలించారు. విధులలో ఉన్న భద్రతా సిబ్బందితో ఆయన మాట్లాడి, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద కదలికలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్ట భద్రత కల్పించాలని ఎస్పీ సిబ్బందికి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here