అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుకున్న జిల్లా టాస్క్ఫోర్స్ , బోయినిపల్లి పోలీసులు..

0
128

1,33,000/- రూపాయల విలువ గల మద్యం, ఒక కార్ సీజ్.. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు..

పంచాయతీ ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం, డబ్బు రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవు.

బలగం టీవీ, బోయినిపల్లి:

ఈసందర్భంగా బోయినిపల్లి ఎస్.ఐ రమాకాంత్ మాట్లాడుతూ.. స్థంభంపల్లి గ్రామానికి చెందిన సంతోష్ మరియు సుమన్ అనే ఇద్దరు వ్యక్తులు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణ పరిధిలోని నంది కమాన్ వద్ద గల వైన్స్ నుండి మద్యం కొనుగోలు చేసి స్థంభంపల్లి గ్రామానికి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు జిల్లా టాస్క్ఫోర్స్ బృందం మరియు బోయినపల్లి పోలీసులు దాడులు నిర్వహించాగా వారి వద్ద 1,33,000/- రూపాయల 253 లీటర్ల మద్యం లభించింది,ఎన్నికల నియవళి ఉల్లగించిన నేపథ్యంలో అట్టి మద్యం, వారు తరలిస్తున్న కార్(Tata car v) సీజ్ చేసి వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని బోయినపల్లి ఎస్.ఐ రమాకాంత్ తెలిపారు. సర్పంచ్ ఎన్నికల నేపధ్యంలో అక్రమ మద్యం, డబ్బు రవాణాకు పాల్పడితే నియమావళి ప్రకారం చర్యలు తప్పవి ఈ సందర్భంగా ఎస్.ఐ హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here