బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో కార్మికుల ఆధ్వర్యంలో జిల్లా విస్తృతస్థాయి సమావేశ పోస్టర్ ను మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ బుధవారం రోజున విడుదల చేసారు.
ఈ సందర్భంగా గురజాల శ్రీధర్ మాట్లాడుతూ: ఈ నెల 16వ తేదీన ఆదివారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వాగు ఒడ్డు సమీపాన అంబా భవాని ఫంక్షన్ హాల్ లో ఉదయం 11:30 నిమిషాలకు సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి సిపిఐఎంపార్టీ (భారత కమ్యూనిస్టు పార్టీ),తెలంగాణ రాష్ట్ర రథసారథి కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ విచ్చేస్తున్న సందర్భంలో ఈ జిల్లాలో ఉన్న కార్మికులు, కర్షకులు, మహిళా బీడీ కార్మికులు, ఉపాధిహామీ కూలీలు, వ్యవసాయ కూలీలు, హమాలి, భవనిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి విచ్చేసి విజయవంతం చేయాలని మండల సిపిఎం పార్టీ పక్షాన కార్మిక వర్గాలకు పిలుపునివ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు, రామంచ అశోక్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.