కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన యశోదా ఆసుపత్రి వైద్యులు

0
116

బలగం టివి: హైదరాబాద్‌‌:
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ ను యశోదా ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. తన నివాసంలోని బాత్రూమ్ లో కేసీఆర్ స్లిప్ అయ్యారని… దీంతో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి ఆయనను తీసుకొచ్చారని ఆసుపత్రి మెడికల్ యశోద హస్పీటల్‌‌ సూపరింటెండెంట్ తెలిపారు. సీటీ స్కాన్ తో పాటు పలు పరీక్షలను నిర్వహించిన అనంతరం… ఆయన ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించామన్నారు. ఆయన ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి కేసుల్లో కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని చెప్పారు. ఆర్థోపిడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన మల్టీ డిసిప్లినరీ టీమ్ ఆయనను పర్యవేక్షిస్తోందన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. క్రమం తప్పకుండా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన అప్డేట్స్ ను అందిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here