బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
– ఆదివారం.. ఆసుపత్రిలో… అకస్మిక తనిఖీ….
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రోస్టర్ లో ఎంత మంది వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు, ఆసుపత్రిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వైద్యులు, సిబ్బందిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అడిగి తెలుసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ, జనరల్, ప్రసూతి, ఆర్థో, పిడియాట్రిక్, సర్జికల్ వార్డులను, ఇతర అన్ని విభాగాలను కలెక్టర్ కలియతిరిగి రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ప్రతీ వార్డులో ప్రస్తుతం ఎంత మంది పేషెంట్లు ఉన్నారు? వారికి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు? వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనే వివరాలను క్షుణ్ణంగా ఆరా తీశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకంతో రోగులు ఆనారోగ్యంతో సుదూర ప్రాంతాల నుండి ఆసుపత్రికి వస్తారని, వారికి అన్ని రకాలుగా భరోసా కల్పించి, మెరుగైన, అత్యుత్తమైన వైద్యం అందించడం ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది కర్తవ్యమని అన్నారు.
లివర్ సమస్యతో బాధపడుతున్న ఒక రోగి పరిస్థితి వైద్యం అందించినా కూడా మెరుగుపడలేదని కుటుంబసభ్యులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే హైదరాబాద్ పంపించి మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు.
ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, ప్రతి నిత్యం పర్యవేక్షణ చేయాలని ఆసుపత్రి పర్యవేక్షకులు లక్ష్మీనారాయణ ను కలెక్టర్ ఫోన్ ద్వారా ఆదేశించారు.
రోగుల బంధువులు, అటెండర్లతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి ఇక్కడ అందిస్తున్న వైద్యం బాగుందా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయాఅని ఆరా తీశారు.