➡️ఇల్లంతకుంటలో రొడ్డ శ్రీకాంత్ ను పరామర్షించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు
➡️సికింద్రాబాద్ యశోద వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయాలని సూచన
➡️నిరుపేద కుటుంబం కావడంతో మానవతదృక్పథంతో చూడాలి
బలగం టీవి, ఇల్లంతకుంట :
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన రొడ్డ శ్రీకాంత్ అనే ఆర్ఎంపీ వైద్యుడు గత ఐదు నెలల క్రితం పిస్తుల ఆపరేషన్ చేయించుకుని ఆపరేషన్ వికటించి మూత్రనాళం ఆపరేషన్ కోసం మళ్ళీ ₹8లక్షల వరకు ఖర్చు అవుతుండటంతో ఆపరేషన్ చేయించుకుందామంటే చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు.
విషయం తెలుసుకున్న కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు శనివారం బాధితుడు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. వెంటనే స్పందించి యశోద వైద్యులతో మాట్లాడి ఆపరేషన్ చేయాలని, మానవత దృక్పథంతో చూడాలని సూచించారు.ఈనెల 17 న శ్రీకాంత్ ఆపరేషన్ కు ఏర్పాట్లు చేయాలన్నారు. అధైర్యపడొద్దు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.