డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు కరెంటు, నీటి సరఫరా చేయాలి
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలి
మాజీ ఎంపీ వినోద్ ను కలిసి గోడు వెళ్లబోసుకున్న పెద్దలింగాపూర్ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
బలగం టివి,ఇల్లంతకుంట :
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన 40 మంది లబ్ధిదారులకు అప్పటి తహశీల్దార్ గారు గ్రామసభ ద్వారా 40 మంది నిరుపేద ఇళ్లులేని లబ్ధిదారులను ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ఇళ్లను కేటాయించడం జరిగిందని,లబ్ధిదారులు ఇళ్లలోకి పోయాక ప్రస్తుతం నీళ్లు, కరెంటు లేకుండా ఇబ్బందులు కలిగేలా చేయడం సరికాదనికరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ , పెద్దలింగాపూర్ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు కలిసి సమస్యను విన్నవించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పెద్దలింగాపూర్ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల్లో 90శాతం నిరుపేద దళితులే ఉన్నారని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉంటున్న లబ్ధిదారులకు కరెంటు, నీళ్లు ఇవ్వకుండా ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారో అధికారులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అడిగి సమస్య పరిష్కారం చేయాలని అన్నారు. లబ్ధిదారులకు నీళ్లు, కరెంటు సరఫరా విషయంలో అధికారులను అడిగితే ఎమ్మెల్యే ను అడగండి అంటూ లబ్ధిదారులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమేంటని అన్నారు.రాజకీయాల్లో పదవులు రావడం,పోవడం సహజమని,కానీ అర్హులైన. లబ్ధిదారులకు ఇల్లు కేటాయిస్తే వారి సమస్యలు తీర్చడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే స్పందించి కలెక్టర్ తో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ,మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ కరీంనగర్ జిల్లా పరిషత్తు చైర్మన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.