బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ‘డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గ్లోబల్ ఐకాన్ అవార్డుల’ ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ కనుకుంట్లకు బెస్ట్ సోషల్ సర్వీస్ అండ్ సైకాలజిస్ట్ అవార్డు లభించింది. గత 15 సంవత్సరాలుగా సైకాలజిస్ట్ గా ప్రజలకు ఆయన అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రధానం చేశారు. అదేవిధంగా, హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న అల్వాల ఈశ్వర్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా వైస్ చైర్మన్ మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో సేవలు అందిస్తున్న గడ్డం దినకర్ లకు ఉత్తమ సామాజిక సేవ అవార్డులు అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి అతిథులుగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల విజయ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ హనుమా గౌడ్ లు హాజరై మాట్లాడారు. మానవ హక్కుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా, రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కన్వీనర్ గాజుల వేణు కుమార్, రాష్ట్ర విమెన్ వింగ్ డైరెక్టర్ గజ్జెల కరుణ లు అవార్డులు అందుకున్న పున్నంచందర్ కనుకుంట్ల, అల్వాల ఈశ్వర్, గడ్డం దినకర్‌లను ప్రత్యేకంగా అభినందించారు.





