భారత రాజ్యాంగం రూపంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బ్రతికే ఉన్నారు..

0
41
  • జింక శ్రీధర్

బలగం టీవీ, వేములవాడ:

నవభారత నిర్మాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భౌతికంగా మరణించి 69 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, ఆయన రచించిన భారత రాజ్యాంగం ద్వారా దేశ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా జీవించే ఉన్నారని కొనియాడారు. దేశ ప్రజలందరికీ సమానమైన హక్కులు కల్పించడం కోసం తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు.

నాయకులు జింక శ్రీధర్ మాట్లాడుతూ, “భారత రాజ్యాంగం రూపంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బ్రతికే ఉన్నారు” అని ఉద్ఘాటించారు. నేటి సమాజం అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకుని, మహనీయుల ఆశయ సాధన కోసం ముందుకు రావాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో చిలుక రమేష్, పిట్ల సతీష్, గుడిసె మనోజ్ కుమార్, సుంకపాక వినయ్, మల్లారం హరీష్, నేదూరి రాజు, నేదురి శ్రీకాంత్, నాగేష్, రాము తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here