బలగం టీవీ, వేములవాడ:
వేములవాడ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి, సమాజానికి అంబేద్కర్ చేసిన సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామితో పాటు నాయకులు చిలుక రమేష్, కూరగాయల కొమరయ్య, బింగి మహేష్, పులి రాంబాబు, తోట రాజు, వస్తాది కృష్ణ, అబ్దుల్ రజాక్, ముంజ ఉపేందర్, ముప్పిడి శ్రీధర్, నాగుల రాము, వలి, కోయల్ కార్ మస్తాన్, కొండా శేఖర్, బాబున్, అంబాటి చందు, మర్రిపల్లి రాజు, అమీల తదితరులు పాల్గొన్నారు.



