ఎల్లారెడ్డిపేట
రాజమహేంద్రవరంలో 2024 లో జనవరి 5,6,7 తేదీ లలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 2వ. అంతర్జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. సమన్వయకర్త కె. రాంప్రసాద్ సూచనమేరకు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డి.గజల్ శ్రీనివాస్ ఈ అంతర్జాతీయ తెలుగు మహాసభలకు ప్రచార కార్యదర్శిగా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన డా.వాసరవేణి పరుశురాం ను నియమించారు. ఈ సందర్భంగా డా. వాసరవేణి పరుశురాం మాట్లాడుతూ తెలుగు భాషా ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతున్న ఈ సభలకు తనను ప్రచారకార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందని తనపై పెట్టిన బాధ్యత ను సమర్ధవంతంగా నిర్వహిస్తానని పరుశురాం తెలిపారు. తెలుగు భాషా మన మాతృభాషననీ తల్లిదండ్రులు నేర్పిందనీ ,మన సంస్కృతి, మాతృభాష గొప్పదనీ దీనిని ప్రపంచానికి చాటాలని తెలిపారు.
