మండేపల్లి ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమంలో స్వామి వివేకానంద 161 వ జయంతి
బలగం టీవి, తంగళ్ళపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి వృద్ధాశ్రమంలో 26 మంది వృద్ధులకు త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న డా.జి. సురేంద్రబాబు మానవత్వంతో నరేన్ ఫౌండేషన్ మరియు అమృత, హిమాన్షి హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమంలో స్వామి వివేకానంద 161 వ జయంతి సందర్భంగా సుమారు 60,000 రూపాయల విలువగల 50 ఎల్పిహెచ్ వాటర్ ప్యూరిఫైడ్,60 లీటర్ స్ఎల్పిహెచ్ ఎస్ఎస్ రిఫ్రిజిరేటర్, పండ్లు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సురేంద్ర బాబు మాట్లాడుతూ భారతమాతకు పూజ చేయాలి అని, భారతమాత అంటే రోగిదేవోభవ, దరిద్ర దేవోభవ, మూర్ఖదేవోభవ అని, పేదవాళ్లు చదువు లేని వాళ్ళు, రోగంతో బాధపడే వారిని పూజిస్తే భారతదేశం జగద్గురువుగా ఎదుగుతాదని స్వామి వివేకనంద తెలుపగా దానిలో భాగంగానే వయో వృద్ధాశ్రమంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోం కో- ఆర్డినేటర్ మమత, సర్పంచ్ గనప శివజ్యోతి, ఎంపిటిసి బుస్సా స్వప్న లింగం,వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ సూపరిండెంట్ అరుణ్ భాస్కర్,గణప మదన్, హోం కో-ఆర్డినేటర్ మమత, విజయలక్ష్మి,ప్రదీప్,గుండ్లూరి నరేష్,గుండ్లూరి రవి,పెద్ది శ్యామ్,అమృత మరియు హిమాన్షి హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
