బలగం టివి, బోయినిపల్లి
బోయినిపల్లి మండల బీజేపీ ఉపాధ్యక్షులు పాలోజు రాజేంద్ర ప్రసాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నర్సింగాపూర్ స్టేజి వద్ద నుండి కొదురుపాక వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం చేపడుతున్న విషయం తెలిసినదే. ఆర్ అండ్ బి అధికారులు ప్రైవేట్ దారులకు కాంట్రాక్ట్ రోడ్డు విస్తరణ పనులను చేస్తున్న సందర్భంలో ఇటు అధికారులు గానీ గుత్తేదారులు కానీ మురికి కాలువలు నిర్మించడం లేదు. మురికికాలువలు నిర్మించకపోవడంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ,వెంటనే మురికి కాలువలు నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
మురికి కాలువలు లేకపోవడంతో దుర్వాసన వస్తుంది.
మండల బీజేపీ ఉపాధ్యక్షులు పాలోజు రాజేంద్ర ప్రసాద్
వెంకట్రావుపల్లి గ్రామం వద్ద ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ నిర్మాణం చేపడుతున్న సందర్భంలో రోడ్డుకి ఇరువైపులా మురికి డ్రైనేజీ కాలువ కూరుకుపోవడంతో మురికి నీళ్లు ఎటు వెళ్లకపోవడంతో,ఇంటి లోపల మురికి నీళ్లు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తుందని,ఇంటిలోని డ్రైనేజీ వాటర్ పోవడం లేదని, వెంటనే నూతన డ్రైనేజీలు నిర్మించాలని అన్నారు.