బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
- పూర్తిగా ఎండిన పంటలకి నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
– బీఆర్ఎస్ యువనేత కడారి నవీన్ రెడ్డి
ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలోని గిరిజన రైతు ఆవేదన చూసి మాలాంటి యువకులకే మనసు చెలించిపోతుందని బీఆర్ఎస్ యువనేత కడారి నవీన్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీకు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు లేదా,కేకే మహేందర్ రెడ్డి ఇదేనా మీకు గిరిజన రైతులపైన ఉన్నా ప్రేమ, రైతు కుటుంబం అని చెప్పుకునే మీరు రైతుల పట్ల ఉన్నా చిత్తశుద్ధి,ప్రేమ ఇదేనా మీ సొంత మండలం ముస్తాబాద్ లోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే మీకు మనసు చెలించడం లేదా అని అన్నారు. మీ మండలంలోనే ఇలా ఉంటే మరి నియోజకవర్గ సిరిసిల్ల జిల్లాలోని రైతుల పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి అని, పంట పొలాల్లో బర్లు,గోర్లు మేపుకునే పరిస్థితి వచ్చిందని వచ్చేలా చేసింది మీ కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.

రైతులు ఎకరానికి సుమారు 40,000 పెట్టుబడి పెట్టి పశువులనీ మేపుకునే పరిస్థితి తెచ్చింది మీ కాంగ్రెస్ ప్రభుత్వమని రైతుల పట్ల చిత్తశుద్ధి,ప్రేమ ఉంటే వ్యవసాయ అధికారులతో ఎండిన పంటల అంచనా వేసి ఒక నివేదన రూపంలో ప్రభుత్వానికి అందించి పంట నష్టం వెంటనే ఇప్పించండని అన్నారు. 4,5 తడులు పెడితే పంట చేతికి వచ్చే పొలాలకి తక్షణమే నీళ్లు వచ్చేలా చేసి రైతులను ఆదుకోండి అని, చేతికి వచ్చిన పంటలకి, అవి ఎటువంటి రకం వడ్లు ఐనా సన్నమైన,దొడ్డుయినా వాటికీ బోనస్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాని అన్నారు. ఇలాంటి గిరిజన రైతులకు ,రాష్టంలో ఉన్నా రైతులకు ఎప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటుందని రైతులను పట్టించుకోని యెడల మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లని ముట్టడిస్తామని అన్నారు.
