ఘనంగా దుద్ధిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకలు..

0
144

ఇల్లంతకుంట మండలంలోని పలు ఆసుపత్రి లో పండ్లు పంపిణి..

బలగం టీవీ, ఇల్లంతకుంట:

ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్ధిల్ల శ్రీపాద రావు 89వ జయంతి వేడుకలను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇల్లంతకుంట మండలంలోని పలు ఆసుపత్రి లో పండ్లు పంపిణి చేశారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ మాజి మండల అధ్యక్షులు అంతగిరి బాలపోచయ్య, పసుల వెంకన్న లు మాట్లాడుతూ.. శ్రీపాద రావు రాజకీయ జీవితం ధన్వవాడ గ్రామ సర్పంచ్ గా మొదులు పెట్టి మంథని నుండి శాసనసభ్యునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా అటూ కాంగ్రెస్ పార్టీలోనూ ఇటు ప్రజాజీవితంలో మచ్చలేని రాజకీయ నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని ఆయనను అజాత శ్రతువు గా పిలుచుకుంటారని గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి, మైనార్టీ మండల అధ్యక్షులు జమాల్, సోషల్ మీడియా అధ్యక్షులు కాసుపాక రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here