వేములవాడలో దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి ఘనంగా నిర్వాహితం – ప్రజాసేవా కార్యక్రమాలతో స్మరణ..

0
26

బలగం టీవీ, వేములవాడ:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా వేములవాడలో ఘనంగా జ్ఞాపకార్థం కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) ఉపాధ్యక్షులు భీమ్ రాజ్ కనకరాజ్ ఆధ్వర్యంలో, ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి స్మరించారు.

అనంతరం, రాజన్న ఆలయం ముందు ఉన్న యాచకులకు పండ్లు పంపిణీ చేయడం ద్వారా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచనల మేరకు ఏర్పాటుచేయబడిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శ్రీపాదరావు ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమాజానికి సేవ చేయడం ద్వారా నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మస్తాన్, లతా, అనిల్, రమేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here