కండువాలు కప్పి ఆహ్వానించిన కేకే మహేందర్ రెడ్డి.
బలగం టీవి,, , ఎల్లారెడ్డిపేట
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుమాల గ్రామానికి చెందిన 100 మంది గ్రామస్తులకు సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆదివారం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.మాజీ ఎంపీటీసీ పొన్నం బాలకిషన్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పారు రెడ్డి సంఘం నుండి జంగ రాంరెడ్డి చల్ల దేవా రెడ్డిల ఆధ్వర్యంలో 50 మంది సభ్యులు పార్టీలో చేరడం జరిగింది. సింగారం మాజీ సర్పంచ్ గొల్లపల్లి మల్లేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా చేరే వారికి ఆహ్వానం పలుకుతుందని అన్నారు రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త పాత అనేది లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేయాలన్నారు.ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, నాయకులు షేక్ గౌస్,లింగం గౌడ్, పసుల కృష్ణ,కొమిరిశెట్టి తిరుపతి, మొగుళ్ల మధు, అనవేని రవి, చెన్ని బాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
