బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- కేసుల విచారణ నివేదికలను పటిష్ఠంగా రూపొందించడంలో రైటర్ల పాత్ర కీలకం.
- రెండవ దశ శిక్షణలో భాగంగా నూతన కానిస్టేబుళ్లకు 15 రోజుల రైటర్ శిక్షణ: ఎస్పీ అఖిల్ మహాజన్.

జిల్లాలో వివిద పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న నూతన కానిస్టేబుళ్లకు రెండవ దశ రైటర్స్ శిక్షణలో భాగంగా 15 రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నమోదు అయిన ప్రతి కేసులలో పిర్యాదు స్వీకరణ, కేసు నమోదు, ఇన్వెస్టిగేషన్,ఛార్జ్ షీట్ వరకు ఏ విధంగా చెయ్యాలి ఏ ఏ అంశాలు క్రోడికరించాలి,నేర స్థలంలో సాక్ష్యాలు ఎలా సేకరించాలి, పంచనామా ఎలా చేయాలి, మొదలగు అంశాలపై శిక్షణా ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేర చేదనలో సాక్షదారాలు సేకరించడం,కేసుల విచారణ నివేదికలను పటిష్ఠంగా రూపొందించడం వల్ల నేర నిరూపణ జరిగి నిందితులకు శిక్షలు పడే విధంగా చేయవచ్చన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నూతన కానిస్టేబుళ్లు వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటు విధులు నిర్వర్తించాలన్నారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న నూతన కానిస్టేబుళ్లకు 15 రోజుల రైటర్ శిక్షణలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కొత్త చట్టాలు,వివిధ నేరస్థలలు సందర్శించిన సమయంలో సాక్షాదారలు ఏ విధముగా సేకరించాలి, శవ పంచనామా ఎలా చేయాలి, నేర స్థలంలో ఏ ఏ వస్తువులు స్వాధీన చేసుకోవాలి,నేర స్థలంలో ఏ ఏ విషయాలు గమనించాలి, సాక్షుల వాంగ్మూలం ఏవిధంగా నమోదు చేయాలి,ఫోరెన్సిక్ లైబరేటరీకి ఎం ఎం పంపించాలి అనే అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఎస్పి వెంట ఇన్స్పెక్టర్ మధుకర్, సిబ్బంది పాల్గొన్నారు.