ఏపీలో సంచలనం సృష్టించిన ట్రాఫిక్ ఈ-చలాన్ల కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ డీజీపీ ఎన్ సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాష్‌పైకేసు నమోదు చేసింది. ఈ కేసులో కొమ్మిరెడ్డి అవినాష్‌తో పాటు అతనికి చెందిన డేటాల ఎవాల్వ్ సంస్థ, మరికొందరిని ఇందులో నిందితులుగా పేర్కొన్నారు. ట్రాఫిక్ ఈ-చలాన్ ఖాతాల పేమెంట్ గేట్‌వే సేవలను క్లోనింగ్ చేయడం ద్వారా అవినాష్ నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఏపీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా నిందితులపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేయడం ద్వారా దర్యాప్తును ప్రారంభించింది. ట్రాఫిక్ చలాన్ల సొమ్మును దారి మళ్లించి డబ్బులు కాజేసిన నిధుల్ని ఎలా దారి మళ్లించారనే దానిపై కూడా ఈడీ ఆరా తీయనుంది.
ఇక, 2017 జూన్ 27న అప్పటి డీజీపీ సాంబశివరావు తన అల్లుడు అవినాష్‌ను చెందిన డేటావాల్వ్ సొల్యూషన్స్‌ను ఈ-చలాన్ సర్వీస్ ప్రొవైడర్‌గా నియమించారని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో 36.5 కోట్లను కొమ్మిరెడ్డి అవినాష్, తదితరులు కొల్లగొట్టారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో డేటా ఈవోల్వ్‌కు చెందిన కొత్తపల్లి రాజశేఖర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న అవినాష్, అతని సోదరి అక్షిత, రవికిరణ్‌లను నిందితులుగా పేర్కొన్నారు. అయితే ఏపీ పోలీసులు కేసు ఆధారంగానే..తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ నమోదు చేసింది.