బలగం టీవి, తంగళ్ళపల్లి :
మండలంలోని శుభోదయ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి పండుగను కన్నులపండగగా విద్యార్థులచే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే పాఠశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎం శ్రీనివాస్ యాదవ్ విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తు పండగ ప్రత్యేకత గురించి వివరించారు. ఉపాధ్యాయులు సుధాకర్ తిరుమల,మాధవి, కళావతి, శిరీష,పద్మశ్రీ, వాణి,సరిత, కీర్తన పాల్గొన్నారు.
