బలగం టివి, సిరిసిల్ల:
కేజ్ కల్చర్ ద్వారా తక్కువ నీటిలో ఎక్కువ సంపాదన..
అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టాలి
అనుపురంలో కుట్టు శిక్షణ,మిల్లెట్ ఫుడ్ తయారీ ప్రారంభం
• ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్
ప్రజలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముంపు గ్రామాల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మిడ్ మానేరు ముంపు గ్రామాల మత్స్యకారులకు కేజ్ కల్చర్ ఫై అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా మత్స్యశాఖ అధికారులు మత్స్యకారులకు కేజ్ కల్చర్ చేపల పెంపకంఫై అవగాహన కల్పించారు.తక్కువ స్థలంలో తక్కువ పెట్టుబడి తో అధిక లాభాన్ని పొందడమే దీని లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం మత్స్యకారుల నుండి దరఖాస్తుల స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజల ఆర్థిక అభివృద్ధికి కేజ్ కల్చర్ చేపల పెంపకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో చేపల పెంపకంతో లాభాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ముంపు గ్రామాల సమస్యలు త్వరలో పరిష్కరించుకుందామని ,అర్హులందరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.మధ్య మానేరు ప్రాజెక్ట్ పరిధిలో మొత్తం 1600 మత్స్యకారుల కుటుంబాలు రిజిస్టర్ అయి ఉన్నాయని ,ప్రస్తుతం మొత్తం 1100 కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉందని అన్నారు.కేజ్ కల్చర్ విధానంలో చేపల పెంపకంతో అధిక లాభాలు సాధించవచ్చని, అధునాతన పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. కేజ్ కల్చర్ ద్వారా తక్కువ నీటిలో ఎక్కువ సంపాదన, ఏటా రెండు సార్లు పెంచి అమ్ముకునే అవకాశం ఉందని తెలిపారు. యేటా రెండు పంటల లాభం తీసే అవకాశం అధికంగా ఉంటుందని తెలిపారు.అధునాతన పద్ధతుల ద్వారా అధిక లాభంతోపాటు ఏటా లక్ష రూపాయల లాభం వస్తుందనికేజ్ కల్చర్ ఏర్పాటు చేసుకున్న వారికి లాభదాయకంగా ఉంటుందనిఅన్నారు. జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ మత్స్యకారులు కేజ్ కల్చర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోని, ఆర్దికంగా రాణించాలని అన్నారు.
ముంపు గ్రామాల మత్స్యకారులకు సువర్ణ అవకాశం
చేపల పెంపకం ముంపు గ్రామాల మత్స్యకారులకు సువర్ణ అవకాశమని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.
యూనిట్ మొత్తం విలువ రూ. 3 లక్షలని, దానిలో పురుషులకు 40 శాతం, మహిళలకు 60 శాతం సబ్సిడీ ఉందని అన్నారు.గ్రామంలోనే నోడల్ బ్యాంక్ ఆద్వర్యంలో శనివారం నుండి శిబిరం ఏర్పాటు చేస్తామని, అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. చేపల పెంపకం ఫై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా టూర్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామని ,అర్హులందరూ వినియోగించుకోవాలని అన్నారు.
మహిళలు అర్ధికంగా రాణించాలి..
వేములవాడ రురూల్ మండలంలోని అనుపురంలోని మొదటి విడుత గా అనుపురం, రుద్రవరం, కోడుముంజ, చింటల్ ఠాణ గ్రామాల మహిళలకి డిఅర్డిఏ సౌజన్యంతో టైలరింగ్ లోని వివిధ మోడల్ లలో అధునాతన ఫ్యాషన్ డిజైనింగ్, మిల్లెట్స్ ఆధారిత ఆహార ఉత్పత్తుల తయారీ శిక్షణ తరగతులను విప్ ఆది శ్రీనివాస్ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి తొ కలసి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడాతూ మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్, మిల్లెట్ ఆధారిత ఆహార పదార్థాల తయారీ ఫై 15 రోజులు శిక్షణ ఇస్తారని, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల దాకా తర్ఫీదు ఉంటుందని అన్నారు. మహిళలు శిక్షణను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా ఎదగాలని పేర్కొన్నారు. స్కూల్ యూనిఫామ్ లు కూడా వీరి ద్వారా కుట్టించే విధంగా చర్యలు చేపడతామనిఅన్నారు. పేపర్ బ్యాగులు కుట్టిస్తే వేములవాడ ఆలయం, అలాగే పట్టణంలోని దుకాణాల్లో తీసుకునేలా ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు.కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
అనుపురం లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి ప్రారంభించారు, మహిళలు శిక్షణ కాలంలో నేర్పించే అంశాలఫై దృష్టి సారించాలని కోరారు. మీరందరూ చాలా మందికి ఆదర్శ ప్రాయంగా నిలువాల న్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఆర్డీఓ శేషాద్రి, నాబార్డ్ ఏజీఎం మోహన్ రెడ్డి, జిల్లా మత్స్య శాఖా అధికారి శివప్రసాద్, ఎంపీపీ బూర వజ్రమ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి తదితరులు ఉన్నారు.
