బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జమ్మూకాశ్మీర్ పహల్గంలో హిందువులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బుర్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నంది కమాన్ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసి, హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ చింతపల్లి వెంకటేశ్వర రావు, సీనియర్ నాయకులు లింగపల్లి శంకర్, ఏరెడ్డి రాజిరెడ్డి, గుండెకర్ల లక్ష్మణ్, బిజెవైమ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక అనిల్, మండల ఉపాధ్యక్షులు బిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జింక శ్రీనివాస్, కార్యదర్శులు కొలనూరి సంజీవ్ రెడ్డి, చొక్కాల మధు, కోశాధికారి సోలంకి అరవింద్, బూత్ అధ్యక్షులు సిల్వెని ప్రశాంత్, గణేష్, కంసాని రాము, చింతకుంట నర్సయ్య, నాయకులు పోచంపల్లి శ్రీకాంత్, ముదం శ్రీనివాస్, ముడికే రాములు, చెర్ల దేవరాజు తదితరులు పాల్గొన్నారు.