– దుకాణాలు కోల్పోతున్న వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆలోచనలు చేస్తుంది..
– పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్
- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..గురువారం వేములవాడ పట్టణంలోని 13,14,15,16 వార్డుల్లో సైడ్ డ్రైన్, సీసీ రోడ్లు మరియు సీసీ కల్వర్టుల నిర్మాణనికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే పరమావధిగా ముందుకు పోతున్నామని తెలిపారు.. వేములవాడ పట్టణంలో 34 కుల సంఘ భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించామని బహుశా వేములవాడ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున కుల సంఘాలకు నిధులు ఎవరు కూడా ఇవ్వలేదని తెలిపారు.. సంతోష్ నగర్ లో మహిళలు బతుకమ్మ తెప్ప నిర్మాణం చేపట్టవాల్సిందిగా కోరగా నిర్మిస్తానని హామీ ఇచ్చారు..గతంలో మంచినీటి సరఫరా కోసం ఇదే కాలనీలో 15 కోట్లతో మంచి నీటి ట్యాంక్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. వేములవాడ పట్టణంలో రాజన్న ఆలయ అభివృద్ధి రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్డు వెడల్పులో కొంత మందికి ఇబ్బంది కలుగుతుందని దాని పట్ల బాధ ఉందని అన్నారు.. రోడ్డు వెడల్పు ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న కార్యక్రమం కాబట్టి నిర్వాసితులతో మాట్లాడి ముందుకూ పోవడం జరిగిందన్నారు. దుకాణాలు కోల్పోతున్న వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆలోచనలు చేస్తుందనీ పేర్కొన్నారు. త్వరలోనే రాజన్న ఆలయ అభివృద్ధికి 76 కోట్లతో టెండర్ కానున్నట్లు తెలిపారు. పది సంవత్సరాలుగా పేద ప్రజలు ఎదురు చూస్తున్నా ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు.
రాబోవు రోజుల్లో ఏ ఎన్నిక వచ్చిన మీ మద్దతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందజేయాలని పిలుపునిచ్చారు. అందరి ఆలోచనలకు అనుగుణంగా వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని తెలిపారు.
