బలగం టివి, ముస్తాబాద్
అంతర్జాతీయ అంబేద్కర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గాలిగాని రాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ గల్ఫ్ బాధితులకు అండగా అంబేద్కర్ సేవా సమితిని స్థాపించడం జరిగిందని పేర్కొన్నారు.ఒమాన్ లో గత ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మహనీయుల జయంతి, వర్ధంతులతో పాటు బ్రతుకుతెరువు కోసం గల్ఫ్ వచ్చి మోసపోయిన బాధితులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని వెల్లడించారు.ఈ కమిటీలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి ఉపాధ్యక్షుడు మెడపట్ల లక్ష్మణ్ రంజిత్ కోశాధికారి ఎల్లయ్య, కార్యదర్శి నరేష్,కోఆర్డినేటర్ వేణు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జవర్ భాషా కల్చరల్ సెక్రెటరీ దుబ్బాక నవీన్ కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ భార్గవ్ గంగ మల్లు పి నరేష్ భూషణ్ గంగారం ఇంచార్జ్ స్వామి ఇమ్రాన్ మిష్ప మధు నూతన కమిటీ సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.