బలగం టివి, గంభీరావుపేట:
ముదిరాజ్ సంఘం గౌరవ అధ్యక్షుడు వీరబోయిన రమేష్ ఆధ్వర్యంలో గంభీరావుపేట మండల ముధిరాజ్ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలకు ముఖ్య అథితిగా ముధిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్శ హన్మాండ్లు హాజరయ్యారు. ముధిరాజ్ సంఘం మండల అధ్యక్షుడి గా శాత్రబోయిన లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా పిట్ల బాబు. ఉపాధ్యక్షులుగా మచ్చ ఆనందం, పిట్ల నర్సయ్య, కోశాధికారిగా తోక దేవదాస్, సంయుక్త కార్యదర్శులుగా పిడుగు విజయ్. వీరబోయిన రమేష్, ముఖ్య సలహ దారులుగా నాగరపు దేవేందర్, ఓరుగంటి నర్సింలు, అరిగె రమేష్, కార్యవర్గ సభ్యులుగా జజ్జరి రమేష్, పర్శ రవి. చాత్రబోయిన బాలయ్య, భీమరి రాజు, రంగు దేవయ్య, గాడిచెర్ల రాములు, పెరిమెల్లి రమేష్, శివంది లింగం లను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో 15గ్రామాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.