*గత మూడు నెలల్లో 47 మొబైల్ ఫోన్స్ ను వెతికి అప్పగించిన ఎల్లారెడ్డి పేట పోలీస్

0
179

బలగం టీవి, ఎల్లారెడ్డిపేట

సెంట్రల్ ఈక్వయిప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్ ద్వారా ఎల్లారెడ్డిపేట పోలీసులు నెల రోజుల క్రితం మిస్సింగ్ అయిన సెల్ ఫోన్ గుర్తించి బాధితులకు అప్పగించామని పోలీసులు ఒక ప్రకటనలు తెలిపారు.ఎల్లారెడ్డి పేట మండలానికి చెందిన రామిండ్ల రత్నయ్య అనునతడు తేదీ 28.11.2023 రోజున పోలీస్ స్టేషన్కు వచ్చి తన యొక్క సెల్ ఫోన్ ఎల్లారెడ్డి పేట గ్రామంలో పోయినది అని ఫిర్యాదు చేయగా, అతని ఫిర్యాదు మేరకు అతని యొక్క సెల్ ఫోన్ ఐ ఎం ఈ ఐ నెంబర్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ లో అప్లోడ్ చేయగా , అట్టి సెల్ఫోన్ దొరికిన వ్యక్తిని గుర్తించి, సెల్ ఫోను స్వాధీనం చేసుకొని, తిరిగి ఫిర్యాదుకి మంగళవారం ఎల్లారెడ్డిపేట యస్.ఐ.రమాకాంత్ అందించడం జరిగింది. ఇకనుండి ఎవరు సెల్ఫోన్ అయినా మిస్సయినచో వారు నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసిన, లేదా వారు ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేసుకున్న వారి సెల్ ఫోన్ త్వరగా గుర్తించడానికి అవకాశం ఉందని ఎల్లారెడ్డిపేట యస్.ఐ తెలపడం జరిగింది. ఈ యాప్ ను అందరూ వారి వారి సెల్ ఫోన్ లో కూడా వినియోగించుకోవడానికి అవకాశం కలదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here