అత్యవసర హెచ్చరిక: గ్రామ పరిధిలో పులి సంచారం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

0
88
  • ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్

బలగం టీవీ, ఇల్లంతకుంట:

గ్రామ ప్రజలందరికీ అత్యవసరంగా తెలియజేయునది ఏమనగా, మన గ్రామ పరిధి, సమీప అడవి ప్రాంతం మరియు పొలాల వైపు పులి సంచారం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందినది. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచించడమైనది.

ప్రజలు ఎవరూ ఒంటరిగా పొలాలు, చెరువు లేదా అడవి ప్రాంతాలకు వెళ్లరాదు. ముఖ్యంగా రాత్రి సమయంలో బయట తిరగడం పూర్తిగా నివారించాలి. పిల్లలను బయట ఒంటరిగా ఆడనివ్వకూడదు. పొలాలకు వెళ్లే వారు తప్పనిసరిగా గుంపులుగా వెళ్లాలి. పశువులను బయట వదిలిపెట్టకుండా సురక్షితంగా కట్టివేయాలి. గ్రామ శివార్లు మరియు అడవి అంచుల వద్ద అనవసరంగా గుమిగూడరాదు.

పులి కనిపించినా లేదా అనుమానాస్పద శబ్దాలు వినిపించినా దగ్గరకు వెళ్లి ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి ప్రయత్నించకూడదు. అవసరమైతే గ్రామంలో తగిన లైటింగ్ ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

పులి కనిపిస్తే వెంటనే చేయవలసినవి..

వెంటనే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, స్థానిక పోలీస్ స్టేషన్ లేదా గ్రామ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అత్యవసర నంబర్లు 100 లేదా 112 కు కాల్ చేయాలి. గ్రామంలో అందరికీ తెలియజేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. పులి ఉన్న దిశలో ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవాలి.

గ్రామ ప్రజలందరూ సహకరించి ఈ హెచ్చరికను అందరికీ తెలియజేయగలరని అధికారులు కోరారు. దయచేసి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించండని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here