బలగం టివి ,,
మిడ్ మానేరు ముంపు గ్రామాల్లోని సుమారు 1000 మంది మత్య కారులకు కేజ్ కల్చర్ ద్వారా ఉపాధి కల్పిస్తామని మంత్రి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచన మేరకు ఉపాధి కల్పన కు ప్రాధాన్యత నిస్తున్నట్లు తెలిపారు.
ముంపు గ్రామాల సమస్యలపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు.
వారి సమస్యలు ఇక కొనసాగవద్దని మంత్రి స్పష్టం చేశారు. ముంపు గ్రామాల పెండింగ్ సమస్యలను మొత్తం పరిష్కరించాలని చెప్పారు.
ముంపు గ్రామాల యువతకు అవగాహన, శిక్షణా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాల ను అందజేయాలని చెప్పారు.
జిల్లాను పది ఫలితాల లో ముందంజలో నిలపాలి
రానున్న మార్చి లో జరుగనున్న పదో తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన చూపి మంచి ర్యాంకులు సాధించేలా, ఫలితాలలో జిల్లాను ముందంజలో నిలిపేలా విద్యా శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ స్కూళ్లు, వివిధ గురుకుల పాఠశాలలోని విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్న హామీ పత్రాన్ని సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ ల నుంచి తీసుకోవాలని చెప్పారు.
ప్రభుత్వ విద్యా సంస్థలు మంచి ఫలితాలు సాధించేలా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, డైలీ టెస్ట్ లు, రివిజన్ తరగతులు, మోటివేషన్ క్లాస్ లు నిర్వహించాలని చెప్పారు.
పిల్లల చదువుల పై స్కూల్ ల బాధ్యులు, హాస్టల్ వార్డెన్లు శ్రద్ద తీసుకోవాలని సూచించారు.
గుడి చెఱువులో సరిపడా నీరు నిల్వ ఉండేలా చూడాలి
వేములవాడ పట్టణపరిధిలో త్రాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
వేములవాడ గుడి చెరువు లో నీటి నిల్వలు సరిపడా ఉండేలా చూసుకుంటూ త్రాగునీటి, సాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు.
మహాశివరాత్రి కి వచ్చే భక్తులకు త్రాగు నీటికి మెరుగైన వసతులు కల్పించాలని సూచించారు.
అగ్రహారం గుట్టల్లో ప్రభుత్వ భూముల లెక్కా తేల్చాలి ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
- జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలు గూగుల్ మ్యాప్ లో కనిపించేలా చూడాలి
వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోనీ గుట్ట లో ప్రభుత్వ, ప్రైవేటు భూముల లెక్కలను తేల్చాలని జిల్లా కలెక్టర్ సూచించారు
ప్రభుత్వ భూమిలోని గుట్టల లెక్కలను హద్దులను నిర్ణయించాలని, పెన్సింగ్ తో ప్రొటెక్షన్ చేయాలని
విప్ ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. దాని హద్దులు నిర్ణయించకపోవడంతో మట్టి, గ్రానైట్ తరలిపోతుందని, ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని విప్ తెలిపారు.
ప్రభుత్వ భూమిలోని గుట్టల నుంచి మట్టి, గ్రానైట్ అక్రమంగా తరలించిన వారి నుంచి పెనాల్టీ వసూలు చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలు గూగుల్ మ్యాప్ లో కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.