బలగం టివి, ,రాజన్న సిరిసిల్ల:
- జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వివరాలు పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కంట్రోల్ రూమ్ లో జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసే తీరును అదనపు కలెక్టర్ పి.గౌతమి తో కలిసి కలెక్టర్ పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఎన్నికల ప్రక్రియలో సిబ్బందికి విధులు కేటాయించేందుకు వీలుగా అన్ని వివరాలు సక్రమంగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. వివరాలు నమోదు చేసే సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని వివరాలు నమోదు చేస్తున్న సిబ్బందికి కలెక్టర్ సూచించారు. ఈ నమోదు ఆధారంగా విధులు కేటాయింపుతో పాటు పోస్టల్ బ్యాలెట్ కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు.
నమూనా ఈవీఎం, వీవీ ప్యాట్ సందర్శన
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన నమూనా ఈవీఎం, వీవీ ప్యాట్ లను అదనపు కలెక్టర్ పి.గౌతమి తో కలిసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు. ఈవీఎంలో ఓటు వేసే విధానాన్ని పరిశీలించారు. అనంతరం రిజిస్టర్ ను తనిఖీ చేశారు. వివరాలు నమోదు చేస్తున్నారా? లేదా అనే విషయాలను ఆరా తీశారు. ఓటు వేసే విధానం, వీవీ ప్యాట్ పై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. ఈ
కార్యక్రమంలో డీఈఓ రమేష్ కుమార్, కలెక్టరేట్ ఏఓ రాంరెడ్డి, ఈ-డిస్ట్రిక్ మేనేజర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు